Loading...

29, జనవరి 2009, గురువారం

సంస్కృతంలో...రాశానోచ్!(తెలుగు లో కూడా చదవండి)

माधव प्रियं मालवी मल्लेश्वरम्
मया मानस गृहेसदा पूजितं|
मनमंदिरम् य: कुर्वन्ति दर्शनीयं

मनसा स्मरामि तं सुमनोहरं ||

ఇప్పుడు ఇదే తెలుగు లో .. .చిత్తగించండి.

మాధవ ప్రియమ్ మాళవీ మల్లేశ్వరం
మయా మానస గృహే సదా పూజితం|
మనమందిరం య: కుర్వన్తి దర్శనీయమ్
మనసా స్మరామి తం సుమనోహరం
-
లక్ష్మీదేవి.


కొంత సందిగ్ధత వల్ల కొంచెం మార్చాను.

17 వ్యాఖ్యలు:

 1. ధన్యవాదాలు.
  తెలుగు లిపి లొ రాసి ఉంటే బాగుండేదని ఫీల్ అయ్యాను. ఇప్పుడు హాపీస్!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మందాకిని గారూ, బాగా రాశారు. ఇంకా రాస్తూ ఉండండి. మీరన్నట్టు తెలుగు లిపిలో రాసి ఉంటేనే బాగుండేది.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ధన్య వాదాలండీ.
  ఇప్పుడు తెలుగులో కూడ చదవొచ్చు. చూడండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ౧ మాలవీ మల్లేశ్వరం -- కొంచెం వివరిస్తారా?

  ౨ మన్మందిరమ్ య: కుర్వతి దర్శనీయమ్ -- మన్మన్దిరం? కుర్వతి? క్షమించాలి, ఏం చెబుదామనుకున్నారో నాకు అర్థం కాలేదు!

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మీ మొదటి టపా మాళవీస్తుతి (కన్నడంలో ఉంది, అది పాటేమో అని నా అనుమానం?) చదివాక మాలవీ-మల్లేశ్వరం గురించి ఇంకా కుతూహలం పెరిగింది :)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. చాలా సంతోషం.
  నాకు సంస్కృతం రాదు కానీ ఒక సందేహం ..
  మమ మానస గృహే అని కదూ ఉండాలి?

  ప్రత్యుత్తరంతొలగించు
 7. రాఘవ గారూ!
  మన్మందిరం= మత్ +మందిరం అంటే నా యొక్క మందిరం అనీ
  కుర్వతి = అంటే చేస్తాడు అనీ
  ఎవరైతే నా యొక్క మందిరాన్ని దర్శనీయంగా (శోభిల్లేలా ) చేస్తారో
  ఇక చివరి పాదంలో
  సాక్షాత్తూ జగత్తుకే ఈశ్వరుడైనటువంటి మల్లేస్వరుని మనసారా స్మరిస్తున్నాను అనీ
  భావిస్తూ రాశానండీ! ఇందులో అర్థదోషాలు ఏమైనా ఉంటే వివరించగలరు. నేను పదవ తరగతి వరకే సంస్కృతం చదివాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. రాఘవ గారూ!
  మాళవీ స్తుతి రాసుకుని పాడుకునేటప్పుడు స్తుతి లాగా అనిపించింది. అందుకే అలా పేరు పెట్టాను.
  ఇకపోతే మాళవీ మల్లేశ్వరులు ఆ టపా లో చెప్పినట్టు మా కులదైవం. ఒక చిన్న పల్లెకు రెండు కిమీ దూరంలో కొండపైన ఒక గుహలొ వెలసిన స్వయంభువు. ఈ స్వామి మరియు మా కుటుంబం గురించి చాల చెప్పాలి. ఇంకో టపాలో తప్పక చెపుతాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. కొత్త పాళీ గారూ,
  సంస్కృతం రాదంటూనే చక్కటి సలహా ఇచ్చారే!
  నేను మయా అంటే = నా చేత
  నా చేత మానస గృహమున నిరంతరంగా పూజింపబడేటటువంటి
  అనే ఉద్దేశ్యంతో రాశాను. పై వ్యాఖ్యకు సమాధానంలో చెప్పినట్టు నేను పదవ తరగతి వరకే సంస్కృతం చదివాను. తప్పు అని ఇప్పుడూ నా మట్టి బుర్రకు అనిపించటంలేదు. కొంచెం వివరిస్తే సరిదిద్దుతాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. అందరికీ ధన్యవాదాలు చెప్పటం కోసమే మళ్ళీ వచ్చాను. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. "మత్" - పంచమీ విభక్తి కదా! "నా యొక్క" అనే అర్థము ఎలా వస్తుంది?

  ప్రత్యుత్తరంతొలగించు
 12. దిద్దాలో అక్కర్లేదో నాకు తెలీదు. మీరు వివరించినాక అర్ధవంతంగా ఉన్నట్టే ఉంది. మయా అన్న మాట వెంటనే మానసగృహం వచ్చేప్పటికి నాచేత మానస గృహం ఏవిట్రా అని అర్ధం కాలేదు. నా చేత అనేది అటుపైన పూజితం అనే క్రియకి అన్వయించాలన్న మాట. వోకే.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. కొత్త పాళీ గారూ!
  సంతోషమండీ! మీకు నా ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. సత్యనారాయణ గారూ!
  సరి అయినది ఏదో కూడా చెప్పండి. ఎందుకంటే నాకున్న సంస్కృత జ్ఞానం కొద్దిపాటిదే.
  దిద్దుకోవడానికి నేను సిద్ధపడే రాయడానికి ఉపక్రమించాను. మీకు నా ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. మందాకిని గారు,
  నాకు ఏది సరైనదో తెలిపే అంత పరిజ్ఞానము లేదు. పెద్దలు ఎవరైనా తీరుస్తారేమోనని నా సందేహాన్ని తెలిపాను. నేను తాడేపల్లి వారి బ్లాగు పుణ్యామా అని కొన్ని విభక్తులు తెలుసుకున్నాను అంతే.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. నేనూ కొంచెం మార్చి రాశాను. (ఎందుకొచ్చిన సందేహం అని)

  ప్రత్యుత్తరంతొలగించు